Kriti Shetty: టాలీవుడ్ కి దొరికిన మరో లక్కీ హీరోయిన్

 చిత్ర పరిశ్రమలో మనుగడ సక్సెస్ తోనే సాధ్యం. టాలెంట్ తో సంబంధం లేకుండా హిట్ అనేది ఒకరి ఫేట్ డిసైడ్ చేస్తుంది. అది దర్శకుడు, హీరో, హీరోయిన్ ఎవరైనా కావచ్చు. నిర్మాతలు అవకాశాలు ఆ ప్రాదిపదికనే ఇస్తారు. ముఖ్యంగా లక్కీ హీరోయిన్ అన్న బ్రాండ్ సంపాదిస్తే అవకాశాలకు కొదవే ఉండదు.వద్దన్నా పిలిచి మరీ ఆఫర్స్ ఇస్తారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం ఆ లక్కీ హీరోయిన్ బ్రాండ్ కృతి శెట్టికి దక్కింది.

Kriti Shetty:

Kriti Shetty:

కృతి శెట్టి వరుస విజయాలతో హ్యాట్రిక్ పూర్తి చేసుకుంది. ఆమె మొదటి చిత్రం ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి నిర్మాతలు, బయ్యర్ల జేబులు నింపింది. 2021లో భారీ లాభాలు తెచ్చిపెట్టిన చిత్రంగా ఉప్పెన రికార్డులకు ఎక్కింది. బేబమ్మగా కృతి నటన కుర్రకారుకు బాగా నచ్చేసింది. ఉప్పెనతో అద్భుతమైన ఆరంభం దక్కగా… రెండో చిత్రం శ్యామ్ సింగరాయ్ తో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కల్లోలం.. పరిస్థితి ఎలా ఉందంటే?

యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం శ్యామ్ సింగరాయ్ సైతం హిట్ టాక్ అందుకుంది. నాని కెరీర్ లో శ్యామ్ సింగరాయ్ హైయెస్ట్ వసూళ్లు అందుకోవడం జరిగింది. పుష్ప, అఖండ చిత్రాలు భారీ విజయం సాధించడంతో శ్యామ్ సింగరాయ్ వసూళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ రెండు చిత్రాలు పోటీ మధ్య నలిగిపోయింది శ్యామ్ సింగరాయ్. లేని పక్షంలో శ్యామ్ సింగరాయ్ వసూళ్లు ఇంకా మెరుగ్గా ఉండేవి. అయితే లాభాలు తెచ్చిపెట్టిన శ్యామ్ సింగరాయ్ హిట్ వెంచర్ గా నిలిచిపోయింది.

ఇక కృతి నటించిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు సైతం భారీ విజయం దిశగా వెళుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన బంగార్రాజు మిక్స్డ్ టాక్ తెచ్చుకొని కూడా రికార్డు వసూళ్లు రాబడుతుంది. మూడు రోజుల్లో బంగార్రాజు దాదాపు వరల్డ్ వైడ్ గా రూ. 43 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 38 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఓపెనింగ్ వీకెండ్ కే బంగార్రాజు బ్రేక్ ఈవెన్ కి దగ్గరైంది. దీంతో బంగార్రాజు మంచి లాభాలు అందుకోవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ వర్గాలు.

ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి హ్యాట్రిక్ విజయాలు పూర్తి చేసింది. కృతి ఆరంభమే అదిరిపోగా టాలీవుడ్ కి దొరికిన మరో లక్కీ హీరోయిన్ అంటున్నారు. దీనితో కృతి శెట్టికి మరిన్ని క్రేజీ ఆఫర్స్ దక్కుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రసుత్తం కృతి రామ్ సరసన తెలుగు, తమిళ్ ద్విభాషా చిత్రం, సుధీర్ బాబుకి జంటగా మరో చిత్రం చేశారు. మరికొన్ని ప్రాజెక్ట్స్ పై ఆమె సంతకాలు చేయాల్సి ఉంది.

Also Read: Sbi Alert:  ఎస్బీఐ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. అలా చేయకపోతే అకౌంట్ క్లోజ్!

Comments